ఏలూరు జిల్లా, భీమడోలు: మండలం పూళ్ళ గ్రామంలో బహిరంగంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని ఏలూరులోని గౌరవ రెండవ తరగతి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా, గౌరవ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈ విషయమై భీమడోలు ఎస్సై షేక్ మదీనా భాష మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా పోలీస్ శాఖ ఎలాంటి ఉపేక్ష చేయదని స్పష్టం చేశారు. తాజాగా పూళ్ళ గ్రామంలో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిపై ‘డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ న్యూసెన్స్’ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.
పూళ్ళ గ్రామానికి చెందిన గెట్టం నాగసాయి (29), తండ్రి కొండలరావు అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు, మహిళలకు అసౌకర్యం కలిగిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చట్ట ప్రకారం కేసు నమోదు చేసి, ఏలూరులోని గౌరవ రెండవ తరగతి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై షేక్ మదీనా భాష గారు మండల ప్రజలకు సూచనలు చేశారు. రోడ్లపై మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, అటువంటి వారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
గ్రామాలు, పట్టణాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎస్సై హెచ్చరించారు. మద్యం సేవించి తప్పు చేసిన వారికి ఈ రిమాండ్ శిక్ష ఒక హెచ్చరికగా భావించాలని, ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.















Social Plugin