ANDRAPRADESH, ఏలూరు జిల్లా: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టే విధంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని చెప్పారు.
శనివారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయనను పలువురు వినతులతో కలిసి సమస్యలను తెలియజేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మట్లాడిన ఎమ్మెల్యే చంటి, వారి సమస్యలను ఓర్పుగా విని, “నేనున్నాను… మీ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తాం” అంటూ భరోసా ఇచ్చారు. వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా అమలవుతున్నాయి. మరోవైపు ప్రజాసమస్యల పరిష్కారం యజ్ఞంలా నిరంతరంగా కొనసాగుతోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాము” అని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు ఇతరులు పాల్గొన్నారు.















Social Plugin