అక్రమ సస్పెన్షన్ వెంటనే రద్దు చేయాలి: ఏఐటీయూసీ నేత రెడ్డి శ్రీనివాస్ డాంగే
దర్యాప్తు జరిగే వరకు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
ANDRAPRADESH, ఏలూరు జిల్లా, ఏలూరు, నవంబర్ 29: ఏలూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకు లో వెలుగులోకి వచ్చిన 83 లక్షల రూపాయల స్కాం పై జ్యూడీషియల్ దర్యాప్తు జరిపి దోషులను గుర్తించాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే డిమాండ్ చేశారు.
శనివారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరు ఆర్టీసీ గ్యారేజీ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన డాంగే, నలుగురు ఉద్యోగులపై విధించిన అక్రమ సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని యాజమాన్యాన్ని కోరారు.
డాంగే మాట్లాడుతూ—
“నాలుగు సంవత్సరాలుగా ఆర్టీసీ ఆయిల్ బంక్ నిర్వహణలో జరిగిన లోపాలను గుర్తించడంలో యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పుడు అకస్మాత్తుగా 83 లక్షల స్కాం బయటపడిన తర్వాత, ఎలాంటి నిర్ధారణ లేకుండా నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం అన్యాయం” అన్నారు. స్కాం పై సంపూర్ణ జ్యూడీషియల్ దర్యాప్తు జరగాలని, దోషులను శిక్షించాలని కానీ దర్యాప్తు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డాంగే డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ మరియు దాని అనుబంధ కార్మిక సంఘాల తరఫున పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ—
“సస్పెండ్ రద్దు అయ్యే వరకు కార్మిక సంఘాల జేఏసీ ఆందోళనలకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తాం” అని ప్రకటించారు. అలాగే బికేయెయం (ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం) జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు కూడా ఆర్టీసీ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. దీక్షలో టి.ఎస్.కే.బాబు, వి.ఆంజనేయులు, బి.ఎన్.వి.ప్రసాద్, వి.వి.రెడ్డి, ఐ.హెచ్.రావు, ఏ.ఎస్.రావు, టిడీ చారి తదితరులు పాల్గొన్నారు.















Social Plugin