ఏలూరు జిల్లాలో పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారికి ఆత్మీయ వీడ్కోలు

ఏలూరు, జనవరి 31, 2026:

ఏలూరు జిల్లాలో ఉద్యోగ నిర్వహణ చేస్తూ 31-01-2026 తేదీన పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ పదవీ విరమణ వీడ్కోలు సభను నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన ఏఎస్సై 1631 కె. మోహన్ రావు (ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ అటాచ్‌డ్ – ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్)ను జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు మాట్లాడుతూ, ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన పదవీ విరమణ చేసిన అధికారి భవిష్యత్ జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అవసరమైన సందర్భాలలో శాఖాపరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌.ఐ పవన్ కుమార్, పోలీస్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర రావు, పదవీ విరమణ చేసిన అధికారి కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.