ఏలూరు జిల్లా,కామవరపుకోట: కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలోని జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
ఈ సందర్భంగా స్థానిక ఉపాధ్యాయులు చిన్నపిల్లలకు భోగిపండ్లతో ఆశీర్వదించి పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
పాఠశాల విద్యార్థులు భోగిమంటలు, కోలాటాలు, ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే గాలిపటాలు ఎగురవేస్తూ పోటీపడి సంక్రాంతి ఆనందాన్ని మరింత పెంచారు.
సోషల్ టీచర్ స్వాతి సంక్రాంతి పండుగలోని మూడు రోజుల ప్రత్యేకతలను విద్యార్థులకు వివరించి సంప్రదాయాల ప్రాధాన్యతను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు, ప్రిన్సిపల్ యోహాన్ బాబు, మణికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సంక్రాంతి వేడుకలను విజయవంతం చేశారు.















Social Plugin