ఏలూరు జిల్లా,చింతలపూడి: మండలం తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తాళం వెంకటేశ్వరావు వద్ద నుంచి సుమారు 2 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. టీవీఎస్ స్టార్ సిటీ మోటార్ సైకిల్‌పై సారాయిని అక్రమంగా రవాణా చేస్తున్న సమయంలో వాహనాన్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
అలాగే, సారాయిని సరఫరా చేసిన అదే గ్రామానికి చెందిన తాళం వెంకటేశ్వరావు అనే వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో టి. నర్సాపురం మండలంలో ఉన్న మద్యం దుకాణాలను కూడా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి పరిశీలనలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ దాడుల్లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌ఐలు అబ్దుల్ ఖలీల్, ఎస్‌ఐ జె.జగ్గారావు తో పాటు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సీఐ పి. అశోక్ తెలిపారు.















Social Plugin