జీలుగుమిల్లి: APTWR స్కూల్ & కాలేజీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా
పోలవరం | జీలుగుమిల్లి మండలం | జనవరి 26:
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలోని APTWR స్కూల్ మరియు కాలేజీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి, విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించారు.
ఎమెల్యేరు మాట్లాడుతూ
ఎమెల్యే చిర్రి బాలరాజు దేశ రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలపై దేశం ముందుకు సాగుతోందని, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
వీరిద్దర ఆశయాలను అనుసరించి విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో చదువులో ముందుకు సాగాలని, విద్య ద్వారానే సమాజం మరియు దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా గిరిజన, బలహీన వర్గాల విద్యాభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తోందని ఆయన అన్నారు. విద్యార్థులు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
విశేష అతిథులు
ఈ కార్యక్రమంలో APTWR స్కూల్ & కాలేజ్ ప్రిన్సిపాల్ హెచ్చం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, బిజెపి అధ్యక్షుడు గుడ్ల రాంబాబు, ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, బండారు అనిల్ కుమార్, గుడపాటి అరుణ్ కుమార్, తోట బాలు, చామన శేఖర్, నారగాని నరేంద్రతో పాటు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.















Social Plugin