లోక్‌సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సంచలన ప్రైవేటు బిల్లు


ఏలూరు/ఢిల్లీ, డిసెంబర్ 05: దేశంలో ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న మిస్సింగ్ కేసులను దృష్టిలో ఉంచుకుని, వాటి దర్యాప్తు కోసం ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయాలంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు.

బిల్లులో పేర్కొన్న వివరాల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం 8 నుండి 9 లక్షలమంది వరకు వ్యక్తులు తప్పిపోతున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ శాతం ఉండటం ఆందోళనకరమని ఎంపీ పేర్కొన్నారు. వేగంగా గుర్తించలేకపోతే ఈ పిల్లలు, మహిళలు మానవ అక్రమ రవాణా మరియు లైంగిక దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మిస్సింగ్ కేసులను ప్రత్యేకంగా, వేగంగా పరిశీలించే ఒక కేంద్ర స్థాయి బ్యూరో ఏర్పాటే ఈ పరిస్థితిని ఎదుర్కొనే సరైన మార్గమని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బిల్లులో జోరుగా ప్రస్తావించారు. తప్పిపోయిన వ్యక్తులను త్వరగా గుర్తించి కుటుంబాలకు చేరవేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన భావించారు.