ఏలూరు, డిసెంబరు 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (OMCAP) సంయుక్తంగా దుబాయ్‌లో జనరల్ హెల్పర్ ఉద్యోగాల కోసం అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కార్యక్రమాన్ని ప్రారంభించాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. జితేంద్ర బాబు మంగళవారం తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి చెందిన అనుభవజ్ఞులైన కార్మికులకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 21 నుంచి 37 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు AED 1000 (సుమారు రూ.24,450) జీతం చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది డిసెంబరు 18, 2025గా నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగం పొందిన వారికి వసతి, రవాణా సదుపాయం, వైద్య సౌకర్యాలు, ఇన్సూరెన్స్, వర్క్ వీసా మరియు జాయినింగ్ ఎయిర్ టికెట్ వంటి బెనిఫిట్స్ కల్పించనున్నట్లు ఆయన వివరించారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. అదనపు వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్లు 99888 53335, 87126 55686ను సంప్రదించవచ్చని జితేంద్ర బాబు తెలిపారు.















Social Plugin