ప్రజా పిర్యాదులతో కిటకిటలాడిన ‘జనవాణి’


ప్రతి సమస్యకు బాధ్యతాయుతమైన పరిష్కారం అందిస్తాం— పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు


ఏలూరు జిల్లా, టి.నరసాపురం: టి. నర్సాపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘జనవాణి’ కార్యక్రమం ప్రజా పిర్యాదులతో కిటకిటలాడింది. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రత్యక్షంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకువచ్చారు.

జనవాణి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముందుగా రుద్రకోట రాజుగూడెం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం టి. నర్సాపురంలోని శివాలయంలో స్వామివారిని దర్శించుకుని, అక్కడి నుంచి ర్యాలీగా జనవాణి వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు.

వేదికపైకి చేరుకున్న అనంతరం ప్రజల నుంచి వచ్చిన వివిధ అంశాలపై అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులను వెంటనే అప్రమత్తం చేసి, సమస్యలపై లోతుగా చర్చించారు. ప్రజలు ఇచ్చిన ప్రతి పిర్యాదుకు కాలపరిమితితో కూడిన నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఖచ్చితంగా ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మాట్లాడుతూ.. “ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన బాధ్యత. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జనవాణి వేదిక ప్రజలకు నమ్మకాన్ని కలిగించే వేదికగా నిలవాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గండమనగు రవికుమార్, జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజు, పూనెం ఆదిత్య, టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం వెంకటేశ్వరరావు, జైవరపు శ్రీరామ్మూర్తి, జెడ్ల సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణ గౌడ్, నెల్లూరి వెంకట చలపతిరావు, పిన్నమనేని మధు, ఆచంట సూర్యనారాయణ, నాలి చక్రవర్తి, కంప సాటి రమేష్, నవీన్, పి. మధు మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.