దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి


గత ఏడాది తల్లికి వందనం క్రింద 67.50 లక్షలు మంది విద్యార్థిని, విద్యార్థులకు రూ 10 వేల కోట్లు అందజేశాము.
మెగా పేరెంట్స్ - టీచర్స్ ఆత్మీయ సమావేశాలు విద్యార్థులు బంగారు భవిషత్తుకు పునాధి.
రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే మాలక్ష్యం.
యువతకు స్పూర్తిని కలిగించేలా ప్రథాతలు పేర్లతో ప్రభుత్వ పథకాలు .
రూ 97.40 లక్షలతో  పాఠశాల ల్యాబ్లు, మౌళిక వసతుల భవనాలు ప్రారంభోత్సవాలు.
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ...


ఏలూరు/నూజివీడు, డిసెంబరు 05: నూజివీడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్లస్ ( బాలికలు) ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పిటియం 3.0 కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ - టీచర్స్, విద్యార్థినులుతో మమేకం అయ్యి విద్య, పాఠశాలలో ఉన్న మౌళిక సదుపాయాలు, విద్యాబోధన, మధ్యాహ్న భోజనపథకం, తదితర విద్యాపథకాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 


రూ 97.40 లక్షలతో ( పియంయస్ హెచ్ఆర్ఐ) నిధులతో బాలికల గ్రంథాలయం, కెమిస్ట్రీ, సైన్స్, బయాలజికల్ ల్యాబ్లు, ప్లే గ్రౌండును, పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కొలుసు పార్థసారథి  ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తల్లితండ్రులు, టీచర్లు  ఆత్మీయ సమావేశాలు పండుగ వాతావరణంలో విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. విద్యను రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకే విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా మన చరిత్రను, సంస్కృతిని గుర్తు చేసేలా  విద్యా రంగంలో విశేష సేవలందించిన వ్యక్తులు పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. 


దేశానికి, రాష్ట్రానికి ఆస్తి విద్యార్థిని, విద్యార్థులేనని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రకీలకం అని, దేశానికి, రాష్ట్రానికి ఆస్తి విద్యార్థిని, విద్యార్థులదే అన్నారు. గత ఏడాది తల్లికి వందనం క్రింద 67.50 లక్షలు మంది విద్యార్థిని, విద్యార్థులకు రూ 10 వేల కోట్లు అందజేశామని అన్నారు. మెగా పేరెంట్స్ - టీచర్స్ సమావేశాలు విద్యార్థులు బంగారు భవిషత్తుకు పునాధి అన్నారు. గత సంవత్సరం లో  తల్లితండ్రులు, టీచర్లు, విద్యార్థులు 2.28 కోట్ల మంది ఆత్మీయ సమావేశంలో పాల్గొని, గిన్నిస్ బుక్కులో రికార్డు నమోదు అయిందని అన్నారు. 

కూటమి ప్రభుత్వం రాగానే రాజకీయ నాయకులు ఫోటోలు, రంగులు తీసేయమని ఆదేశాలు జారీ చేశామన్నారు. పాఠశాలల్లో విద్యాభ్యాసం, విద్యకు సంబంధించిన సమావేశాలు, జాబ్ మేళాలు తప్ప మరే ఇతర కార్యక్రమాలు నిర్వహించ వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసామని అన్నారు. రాజకీయ కార్యక్రమాలకు, రాజకీయాలకు మన పిల్లలను దూరంగా ఉంచాలని హితవు పలికారు. విద్యతోపాటు నైతిక విలువలూ ముఖ్యమేనని, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళినా మీరు చదువుకున్న పాఠశాలను మర్చిపోవద్దని తెలిపారు. 


డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజన పథకం క్రింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, ఆయా ప్రాంతాలు ఆహార అల‌వాట్ల‌ను గౌర‌విస్తూ పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తూ, నైతిక విలువలు సంబంధించినవి మాత్రమే ఉపాధ్యాయులు చెప్పాలని, ఇతర పనులు చెప్పవద్దని సూచించారు. 01 నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర స్టూడెంటు కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

గత ప్రభుత్వంలో  డియస్ సి ద్వారా ఒక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయలేదని, మన ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులు తగ్గట్టుగా  విద్యా బోధనకు 16,347 టీచర్లను నియమించామని అన్నారు. మహిళలను గౌరవించడం చిన్నవయస్సు నుండే నేర్పించాలని అన్నారు. బాలికలను, మహిళలను చులకనగా చేసే పదాలు వాడకూడదని అన్నారు. ఎక్కడా కూడా బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, జిల్లాలో జీరో శాతం  నమోదుకావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, డివైఇవో డా.పి.యస్.సుధాకర్, తహశీల్దారు జి. బద్రు, యంపిడివో సి.హెచ్. రాఘవేంద్ర నాథ్, పురపాలక సంఘం కమీషనరు కె.పీరయ్య, మండల విద్యాశాఖ అధికారి డి.వర ప్రసాదు, పురపాలక సంఘం వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మండల వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ నేరుసు నాగులు, ప్రధానోపాధ్యాయులు బొమ్మిశెట్టి అనురాధ, ఉపాధ్యాయులు, నాన్ టీచింగు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, విద్యార్థినులు వారి తల్లితండ్రులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.