క్రైస్తవుల స్మశానవాటిక స్థల పరిశీలనకు ప్రత్యేక దృష్టి — ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, డిసెంబర్‌ - 9: క్రైస్తవుల స్మశానవాటిక ఏర్పాటుకు అవసరమైన మేర స్థల పరిశీలనకు ప్రత్యేక దృష్టిసారించినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను దృష్టిలో ఉంచుకుని, అందరి మనోభావాలను గౌరవిస్తూ ముందుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. 


ఏలూరు పత్తేబాద మోజెస్‌ నగర్‌లోని తెలుగు బాప్టిస్టు సెంట్రల్‌ చర్చి ఆవరణలో మంగళవారం వివిధ క్రైస్తవ సంఘాలు, ఫాస్టర్‌లతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రైస్తవుల స్మశానవాటిక స్థల సమస్య నిమిత్తం ఎంతో మంది నాయకులు పబ్బం గడుపుకునేలా వ్యవహరించారని, తానుమాత్రం అలా కాదని స్పష్టం చేశారు. క్రైస్తవ సంఘాలంతా సమిష్టిగా ఈ విషయంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

భేషజాలు పక్కనపెట్టాలని సూచించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్ధిక సహకారం అందిస్తే,,, తాను తన తండ్రి బడేటి శ్రీహరిరావు ట్రస్ట్‌ ద్వారా ఆర్ధికంగా చేయూతనందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే స్థలం విషయంలో ప్రభుత్వం నుండి 50శాతం సహకారం అందేలా చర్యలు చేపడతానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఫాస్టర్లు తదితరులు పాల్గొన్నారు...