శనివారం టీ. నర్సాపురంలో నిర్వహించిన హిందూ సమ్మేళన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హిందువులంతా కులాలుగా విడిపోయకుండా ఐక్యత భావంతో ముందుకు సాగాలని కోరారు. ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మత మార్పిడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర మతాలవారు మనకు సోదరులతో సమానమేనని, అయితే మత మార్పిడులు చేయించే వారే సమస్యగా మారుతున్నారని పేర్కొన్నారు. “ధర్మ పరిరక్షణ నాకెందుకు” అని అనుకోవడం మూర్ఖత్వమని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశంలో లౌకికవాదం పేరుతో హిందుత్వానికి నష్టం జరుగుతోందని రాదా మనోహర్ దాస్ వ్యాఖ్యానించారు. హిందుత్వం ఉన్నంతకాలం దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. మనల్ని గౌరవించని మతాలను మనం ఎందుకు గౌరవించాలని ప్రశ్నించారు.
సనాతన ధర్మం అత్యంత పురాతనమైనదని, ఈ దేశంలో హిందువుగా జన్మించడం పూర్వజన్మ సుకృతమని ఆయన వివరించారు. ధర్మం నిలిచినప్పుడే దేశం నిలబడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శి శివ గణేష్, చింతలపూడి ఖండ కార్యదర్శి సతీష్, ప్రముఖ బీజేపీ నాయకులు చాట్రాత్రి యుగంధర్, టీ. నర్సాపురం సమరస్త సేవ ఫౌండేషన్ కన్వీనర్ నార్ని వెంకటరావు, చింతలపూడి ఖండ కన్వీనర్ మరీదు వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే ఆహ్వాన కమిటీ నాయకులు పసుమర్తి రాము, ఆలయ కమిటీ చైర్మన్ అనుములు శ్రీనివాస్ రావు, అనుమోలు సంధ్యారాణి, జట్ల రాంబాబు, సాయి, విశ్వనాథ్, శ్యాంసుందర్, కాలనీటి రాంబాబు, అడపా వెంకటరావు, పూర్ణశేఖర్, రామలింగేశ్వరరావు, నాగార్జున, అయ్యప్ప తదితరులు హాజరయ్యారు.
_11zon.jpg)















Social Plugin