పార్టీ అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపు
ఏలూరు జిల్లా, చింతలపూడి, నవంబర్ 29: నియోజకవర్గంలోని పట్టణ మరియు మండలాల కోసం ఇటీవల పార్టీ అధిష్టానం కొత్తగా నియమించిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షులతో చింతలపూడి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ పటిష్టత, భవిష్యత్ కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ.. “కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు పార్టీ అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలి. ప్రజల సమస్యలపై చురుకైన స్పందన చూపుతూ, మెరుగైన సేవలందించడంలో ముందుండాలి” అని సూచించారు.
మండల పరిధి నుంచి గ్రామస్థాయి వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను బాధ్యతాయుతంగా, విజయవంతంగా అమలు చేయాలి అని రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మండల టిడిపి అధ్యక్షులు మాట్లాడుతూ.. “శాసన సభ్యులు చేసిన సూచనలు తప్పక పాటించి, పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉంటాం” అని తెలిపారు.















Social Plugin