కుక్కునూరు: అటవీ భూముల్లో చెట్ల రక్షణ కరువైందన్న ఆరోపణలు కుక్కునూరు మండలంలో వెల్లువెత్తుతున్నాయి. అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా అటవీ ప్రాంతాల్లోని జామాయిల్ చెట్లను కొందరు వ్యక్తులు అడ్డగోలుగా నరికివేసి వాటిని అక్రమంగా అమ్ముకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మండలంలోని అమరవరం అటవీ రేంజ్ పరిధిలోని కొండపల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఇటీవల జామాయిల్ చెట్లను నరికివేసి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ఇది మొదటిసారి కాదని, గతంలో ఇదే రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతాల్లోని మారుజాతి కలపను, అలాగే మాధవరం టేకు ప్లాంటేషన్‌లోని టేకు చెట్లను కూడా కొందరు వ్యక్తులు అక్రమంగా నరికి తరలించినట్టు ఆరోపణలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
అదేవిధంగా ఇదే అటవీ రేంజ్ పరిధిలో అటవీ భూముల్లో జామాయిల్ నర్సరీలను అక్రమంగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ తరహా అక్రమాలు, ఆక్రమణలు జరుగుతున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
అటవీ సంపద పరిరక్షణకు సంబంధిత శాఖ తక్షణమే చర్యలు తీసుకుని, అక్రమ నరికివేతలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
.jpg)














Social Plugin