దెందులూరు/ఏలూరు: ఏలూరు తూర్పు వీధిలో వైభవంగా జరుగుతున్న శ్రీ గంగానమ్మ జాతర–2025-26లో భాగంగా శనివారం ఉదయం శ్రీ వినుకొండ అంకమ్మ అమ్మవారిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దర్శించుకున్నారు. భక్తుల కోలాహలం మధ్య అంబరాన్ని అంటుతున్న ఉత్సవ వాతావరణంలో జాతర సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
జాతర కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారిని ఆవాహన చేసి, చిత్ర విచిత్ర వేషధారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల నినాదాల మధ్య అమ్మవారి నగరసంచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతర కమిటీ నిర్వాహకులు ఘనంగా చేపట్టారు.
అమ్మవారి నగరసంచారం ఏలూరు వన్‌టౌన్ పరిధిలో కొనసాగుతుండగా, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి నగరసంచారం చేస్తున్న ట్రాక్టర్ రథాన్ని ఎమ్మెల్యే స్వయంగా కొంత దూరం నడిపించడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా జాతర కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. జాతర ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ భక్తిశ్రద్ధలతో సందడి చేస్తున్నారు.















Social Plugin