ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో కాపా శ్రీనివాసరావుకు ఘన సత్కారం
కాపా శ్రీనివాసరావుకు ‘మహాత్మా గాంధీ 150వ జయంతి’ స్మారక పురస్కారం
న్యూఢిల్లీ | జనవరి 26: 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాపా శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు.
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో, గాంధీజీ 150వ జయంతి స్మారక పురస్కారాన్ని కాపా శ్రీనివాసరావుకు అందజేశారు. మహాత్మా గాంధీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’ లక్ష్యాన్ని సాధించే దిశగా అంకితభావంతో పనిచేస్తున్న వారికి అందించే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఆయనకు లభించడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ, “దేశ రాజధానిలో, గణతంత్ర దినోత్సవం వంటి గొప్ప సందర్భంలో ఈ గౌరవం దక్కడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది. కొత్త రావిచెర్ల గ్రామ అభివృద్ధికి, ప్రజల సేవకు నిరంతరం కట్టుబడి ఉంటాను” అని తెలిపారు.
అలాగే ఈ పురస్కారాన్ని అందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.















Social Plugin